News April 24, 2025
విశాఖలో పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జె.సుభద్రతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. వీరు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలమైన భారతదేశానికి బలమైన గ్రామ పాలన అవసరమని జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు.
Similar News
News April 25, 2025
విశాఖలో 97 మంది పోలీసులకు రివార్డులు

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 97 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.
News April 24, 2025
జ్ఞానాపురం చర్చి మైదానంలో బాలిక మృతదేహం

విశాఖలోని జ్ఞానాపురం చర్చి మైదానంలో అనుమానస్పద స్థితిలో పడి ఉన్న 11 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చర్చి ప్రతినిధులు గుర్తించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతి పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిలోనే బాలిక తల్లి, అమ్మమ్మ ఉన్నారు.
News April 24, 2025
చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజలు మరణించడం తన మనసును కలిచివేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ కుటుంబాని పవన్ హామీ ఇచ్చారు.