News March 24, 2025
విశాఖలో పలు సంస్థల డ్రైవర్లకు అవగాహన

విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల యాజమాన్యాలకు, డ్రైవర్లకు ఉప రవాణా కమీషనర్ కార్యాలయంలో ఆదివారం అవగాహనా నిర్వహించారు. డ్రైవర్ అలర్ట్ సందేశాల వెళ్ళకుండా చూడాలని యాజమాన్యనికి.. రహదారి నియమ నిభందనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించాలని సంస్థల యాజమాన్యనికి ఇన్ ఛార్జ్ ఉపరవాణా కమీషనర్ ఆర్‌సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News April 22, 2025
విశాఖ: మేడ మీద నుంచి పడి వివాహిత మృతి

మేడ మీద బట్టలు ఆరవేయడానికి వెళ్లి వివాహిత మృతి చెందిన ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. 61వ వార్డు ఇండస్ట్రీ కాలనీలో నివాసముంటున్న కోమలి తన ఇంటి మూడో అంతస్తులో బట్టలు ఆరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త శ్రీనుబాబు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 22, 2025
నేటి నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో సమ్మర్ క్యాంప్

ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేడియంలో ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా సోమవారం తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ ఉదయం 12రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో విశాఖలో నివసించే వారు అర్హులని అన్నారు. పూర్తి వివరాలకు రైల్వే స్టేడియంలో సంప్రదించాలన్నారు.
News April 22, 2025
సింహాచలంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు

సింహాచలం వరహాలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఈనెల 26 సాయంత్రం నుంచి భక్తులు కొండ కింద వరాహ పుష్కరిణి వద్ద జాగరము ఉండి స్నానమాచరించి స్వామి వారి దర్శనము చేసుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఏప్రిల్ 28 నుంచి మే2 వరకు ఆలయంలో తిరునక్షత్ర మహోత్సవము నిర్వహించనున్నారు. పైతేదీలలో అన్ని రకాల సేవలు రద్దు చేశారు.