News November 7, 2024
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

విశాఖలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్కు గురువారం శంకుస్థాపన చేశారు. చినగదిలిలో రెండు ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలంపిక్స్ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని అన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News October 22, 2025
నాగులచవితికి విశాఖ జూ పార్కు వేళల్లో మార్పు!

నాగులచవితి పండగ సందర్భంగా విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ వేళల్లో మార్పులు చేశారు. శనివారం రోజు సందర్శకుల కోసం పార్కును సాధారణ సమయం కంటే ముందుగా ఉదయం 7:30 గంటలకే తెరవనున్నట్లు క్యూరేటర్ మంగమ్మ ప్రకటించారు. జూ లోపల పటాకులు, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News October 22, 2025
విశాఖలోనే మొదటి రీజినల్ ల్యాబ్

రాష్ట్రంలోని విశాఖలోనే తొలిసారిగా రీజినల్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. బుధవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఫుడ్ సేఫ్టీ శాఖలో సిబ్బంది కొరత ఉందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతిభగల వారిని ఈ శాఖలోకి తీసుకువచ్చేందుకు అవకాశాలు పరిశీలిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని వెల్లడించారు.
News October 22, 2025
విశాఖ: అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలకు క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి S.వెంకటేశ్వరరావు కోరారు. అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 28వ తేది రాత్రి11:59 గంటలలోపు www.dbtyas-sports.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.