News October 9, 2024
విశాఖలో పెరిగిన విమాన ప్రయాణికులు
విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జులైలో 1,720 విమానాల ద్వారా 2,25,261 మంది.. ఆగస్టులో 1,872 విమానాల్లో 2,52,311 మంది ప్రయాణించినట్లు ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబరులో 1,806 సర్వీసుల్లో 2,25,215మంది ప్రయాణించినట్లు వివరించింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే 6.8శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.
Similar News
News November 12, 2024
అల్పపీడనంపై విపత్తు ఎండీతో హోం మంత్రి సమీక్ష
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండి రోణంకి కూర్మనాథ్‌తో రాష్ట్ర హోం&విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో సమీక్షించారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై తగిన సూచనలు సలహాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించానన్నారు.
News November 11, 2024
విశాఖలో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విశాఖ జిల్లా కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది. ప్రజల నుంచి వినతులు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్, ఆర్డీవో పి. శ్రీలేఖ, ఏడీసీ వర్మ స్వీకరిస్తున్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు.
News November 11, 2024
తలసరి ఆదాయంలో విశాఖనే నంబర్ 1
ఏపీలో జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా తలసరి ఆదాయం లెక్కలు బహిర్గతమయ్యాయి. 2022-23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.4.83 లక్షలతో విశాఖ టాప్ ప్లేస్‌లో ఉంది. రూ.2.10 లక్షలతో అనకాపల్లి 10వ స్థానంలో నిలవగా.. రూ.1.37 లక్షలతో అల్లూరి సీతారామరాజు చివరి స్థానానికి పరిమితమైంది. 2021-22లో కృష్ణా మొదటి స్థానంలో విశాఖ 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.