News February 10, 2025

విశాఖలో పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన డీజీపీ

image

విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.

Similar News

News November 21, 2025

విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

image

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్‌ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.

News November 21, 2025

ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.

News November 21, 2025

విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

image

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.