News March 20, 2025

విశాఖలో ప్ర‌త్యేక‌ ఆధార్ క్యాంపులు

image

విశాఖ జిల్లాలో గురువారం నుంచి ప్ర‌త్యేక ఆధార్ క్యాంపులు నిర్వ‌హించనున్నట్లు కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ బుధవారం తెలిపారు. రేపటి నుంచి మార్చి 22 వరకు, మార్చి 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఆధార్ క్యాంపుల నిర్వహణపై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారులను ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో, కామన్ సర్వీస్ సెంటర్‌లో ఆధార్ సేవలు అందుతాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 21, 2025

విశాఖలో ఆశీల వసూళ్లకు బహిరంగ వేలం

image

జీవీఎంసీ జోన్ -3 పరిధిలో 2025-26 సంవత్సరానిగాను పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోన్-3వ జోనల్ కమిషనర్ శివప్రసాద్ గురువారం తెలిపారు. జోన్-3లో మార్కెట్లు, లుంబిని పార్క్ ప్రవేశానికి, పార్కింగ్ టికెట్ వసూలు చేసేందుకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆశీలుమెట్ట జీవీఎంసీ జోన్ -3 జోనల్ కార్యాలయంలోని హాజరు కావాలన్నారు.

News March 20, 2025

విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: మంత్రి దుర్గేశ్‌

image

విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విశాఖపట్నంలో సినీపరిశ్రమ అభివృద్ది, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిపై మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

News March 20, 2025

విశాఖలో పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీలో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు నారా లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేనలో గురువారం చేరారు. పార్టీ మారిన వారిలో 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజిని, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ ఉన్నారు.

error: Content is protected !!