News January 5, 2025
విశాఖలో ప్రధాని పర్యటన.. ఆ ఎమ్మెల్యేలకు బాధ్యతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736067049489_20522720-normal-WIFI.webp)
ఈ నెల 8న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మంత్రి లోకేశ్ నాయకులు, అధికారులకు ఆదేశించారు. ప్రధాని రోడ్ షోలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. రోడ్ షో బాధ్యతలను ఎమ్మెల్యే గణబాబుకు అప్పగించారు. బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చూసుకోవాలన్నారు. గణబాబు, పల్లాకు అందరూ నేతలు సంపూర్ణ సహకారం అందించాలని లోకేశ్ సూచించారు.
Similar News
News January 24, 2025
ఆదివారం మాంసం దుకాణాలు బంద్: జీవీఎంసీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737705090589_51703515-normal-WIFI.webp)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు మేరకు విశాఖలో మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ దువ్వాడ, మంగళపాలెం, నరవ ప్రాంతాల్లో దుకాణ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
News January 24, 2025
మోసపూరిత ప్యాకేజీలతో మోసం చేయోద్దు: శైలజానాథ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737702067493_52419162-normal-WIFI.webp)
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ శుక్రవారం సందర్శించారు. శిబరంలో కూర్చుని కార్మికులతో చర్చించారు. ప్రకటించిన ప్యాకేజీ ఏ మేరకు లబ్ది చేకూరుతుంది.. ఎలాంటి అంశాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. మోసపూరిత ప్యాకేజీలతో స్టీల్ ప్లాంట్‌కు అన్యాయం చేయొద్దని అన్నారు. సెయిల్‌లో విలీనం చేసి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
News January 24, 2025
శకటంలో 30కి పైగా ఏటికొప్పాక బొమ్మలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737700672354_19090094-normal-WIFI.webp)
ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఏటికొప్పాక లక్కబొమ్మల శకటం ఎంపికైన సంగతి తెలిసిందే. ఏటికొప్పాకకు చెందిన కళాకారుడు గోర్స సంతోశ్ తయారుచేసిన ఈ శకటంలో 30కి పైగా లక్క బొమ్మలు ఉంటాయి. వీటిలో వెంకటేశ్వర స్వామి, వినాయకుడుతో పాటు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించే లక్క బొమ్మలు ఉంటాయని సంతోశ్ తెలిపారు. NOTE: పైనున్న ఫొటోలో నమూనాను చూడొచ్చు.