News January 6, 2025
విశాఖలో ప్రధాని బహిరంగ సభకు 2లక్షల జనం..!

విశాఖలో ఈనెల 8న నిర్వహించనున్న ప్రధాన మోడీ బహిరంగ సభకు సుమారు రెండు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రులు, నేతలు ఇప్పటికే విశాఖలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సంపత్ వినాయక ఆలయం నుంచి ఏయూ గ్రౌండ్ వరకు నిర్వహించనున్న రోడ్ షోకు సుమారు లక్షమంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Similar News
News January 3, 2026
విశాఖ: సొంత భవనంలోకి NIO ప్రాంతీయ కార్యాలయం

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫి విశాఖ ప్రాంతీయ కార్యాలయం త్వరలో సొంత భవనంలోకి మారనుంది. సముద్ర తీర పరిశోధనల కోసం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్యూ రిసార్ట్ సమీపంలో 3 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 3, 2026
విశాఖ: న్యూఇయర్ రోజు మర్డర్.. కారణం ఇదేనా?

విశాఖ జిల్లా కాకానినగర్లో న్యూఇయర్ రోజు <<18740809>>దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్పోర్ట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్ తమను తిట్టాడనే కారణంతో ఈ ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేసి చంపినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ శంకర్ నారాయణ శనివారం తెలిపారు.
News January 3, 2026
విశాఖ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

విశాఖ జిల్లాలో 20 ఉద్యోగాలకు ప్రభుత్వం <


