News March 29, 2025
విశాఖలో ప్రేమ పేరుతో మోసం

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News April 3, 2025
సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం

కలెక్టర్ సందీప్ కుమార్ఝా పై హైకోర్టు మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు ఇల్లీగల్ ఆర్డర్ అంటూ మహిళపై కలెక్టర్ కేసు బుక్ చేయించారు. దీంతో విషయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News April 3, 2025
వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 3, 2025
గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.