News March 29, 2025

విశాఖలో ప్రేమ పేరుతో మోసం

image

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News April 23, 2025

HYD: ‘డ్రగ్స్‌కు నో… భవిష్యత్తుకు అవును చెప్పండి’

image

రాచకొండ CPసుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు మత్తుపదార్థాల విపత్తుపై యువతలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ‘మీరు ముగించడానికి పుట్టలేదు…ప్రారంభించేందుకు పుట్టారు’ అనే శక్తివంతమైన సందేశంతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.”డ్రగ్స్‌కు నో చెప్పండి…మీ భవిష్యత్తుకు అవును చెప్పండి” నినాదంతో యువతలో మార్పు తీసుకురావాలని పోలీసులు ఆకాంక్షించారు.

News April 23, 2025

నిర్మల్: INTER RESULTSలో అమ్మాయిలదే పైచేయి

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్ ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 43.54 శాతంతో ఉత్తీర్ణత సాధించగా బాలికలు 70.84 శాతం మంది పాసయ్యారు. సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం బాలురది 54.31గా ఉండగా బాలికలు 80.93గా సాధించారు. జిల్లాల మొత్తానికి ఫలితాల సాధనలో బాలికలదే పైచేయి సాధించారు.

News April 23, 2025

ASF: సివిల్స్‌లో మెరిసిన రైతుబిడ్డ

image

రైతుబిడ్డ సివిల్స్ ఫలితాల్లో మెరిసి ఔరా అనిపించారుడు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లికి చెందిన రాంటెంకి సోమయ్య-ప్రమీల దంపతుల కుమారుడు సుధాకర్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 949వ ర్యాంక్ సాధించారు. మారుమూల గ్రామీణ ప్రాంతంలోని రైతుబిడ్డ ఆల్ ఇండియా స్థాయిలో సివిల్స్ ర్యాంక్ సాధించడంపై జిల్లావాసులు అభినందించారు. జిల్లా బిడ్డకి మీరు CONGRATULATIONS చెప్పేయండి.

error: Content is protected !!