News September 11, 2024
విశాఖలో బాలికపై అత్యాచారం..!

విశాఖలో మంగళవారం రాత్రి దారుణఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ గోపాలపట్నంలోని ఓ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.