News March 31, 2025
విశాఖలో బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు అరెస్ట్: సీపీ

క్రికెట్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడితో పాటు ప్రమోట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తూ విశాఖలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రవీణ్ కుమార్, మదీనావలి, రజియాబేగం, ధరణి అనే వారిని అరెస్టు చేశామని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లపై సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 4, 2025
విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి ఒడిశా యువకులతో 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
News November 4, 2025
విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లు

ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్‌తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజరవుతారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News November 4, 2025
ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.


