News March 31, 2025
విశాఖలో బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు అరెస్ట్: సీపీ

క్రికెట్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడితో పాటు ప్రమోట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తూ విశాఖలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రవీణ్ కుమార్, మదీనావలి, రజియాబేగం, ధరణి అనే వారిని అరెస్టు చేశామని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లపై సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 17, 2025
వైసీపీకి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా

జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక YCPకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నానని అధినేత జగన్‌కు లేఖ పంపారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరనున్నది అనేది తెలపలేదు. కాగా ఇవాళ ముగ్గురు YCP కార్పొరేటర్లు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న మేయర్‌పై అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో నంబర్ గేమ్ ఉత్కంఠగా మారింది.
News April 17, 2025
వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు సులభంగా పొందవచ్చని విశాఖ ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టి ప్రజలకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవచ్చన్నారు.
News April 17, 2025
కేంద్ర హోంమంత్రి చేతులు మీదుగా పురస్కారం అందజేత

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే పరేడ్ గురువారం మద్యప్రదేశ్‌లో జరిగింది. ఈ వేడుకలలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరాధ్యుల శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీనివాస్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేశారు. 34 ఏళ్లకు పైగా దేశ భద్రతకు ఆయన చేసిన సేవలకి గాను ఈ పురస్కారం లభించింది.