News May 26, 2024
విశాఖలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

విశాఖ నగరంలో శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు పలుచోట్ల విస్తృతంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్వయంగా పర్యవేక్షించారు. జోన్-1 పరిధిలో ఫోర్ వీలర్స్-17, టూ వీలర్స్-148, ఆటోలు-17, జోన్-2 పరిధిలో టూ వీలర్స్-175, ఆటోలు-10, ఫోర్ వీలర్స్-14, ఒక కమర్షియల్ వాహనంపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 8, 2025
గాజువాక: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

గాజువాక సమీపంలో గల దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో అగనంపూడి రైల్వే ట్రాక్ వద్ద రాదేశ్(38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీహరిపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
News February 8, 2025
బాలిక ప్రసవంపై డీఎస్పీ విచారణ

భీమిలిలో చదువుతున్న అనకాపల్లి(D) చీడికాడ మండలానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చి KGHలో <<15386000>>ప్రసవించిన సంగతి విదితమే<<>>. నెలలు నిండక ముందే 6 నెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించింది. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి చీడికాడ PSకి బదిలీ చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు చీడికాడ SI సతీశ్ చెప్పారు. పోక్సో కేసు కావడంతో ఈ కేసును DSP విచారిస్తారన్నారు.
News February 8, 2025
విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.