News March 14, 2025
విశాఖలో భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు

భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులు ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల క్రమబద్దీకరణపై అవగాహన కల్పించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ మయూరి అశోక్‌తో పాటు పలువు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 24, 2025
విశాఖలో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.
News March 24, 2025
విశాఖలో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి.. కేసు నమోదు

సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యజమానిపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఆక్సిజన్ టవర్స్‌లో నివాసం ఉంటున్న ప్రసాద్ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయగా మర్యాదగా పిలవలేదని దాడి చేసి బట్టలు విప్పి బయటకు పంపించేశారు. వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
News March 24, 2025
విశాఖ: మ్యాచ్‌కు ఈ వస్తువులు తీసుకెళ్లొద్దు

ఐపీఎల్ మ్యాచ్‌కు పలు వస్తువులను నిషేధిస్తూ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు. అగ్గిపెట్టెలు, లైటర్, మద్యం సీసాలు, గుట్కా, గాజు వస్తువులు, సెంట్ బాటిల్లు, కర్రలు, తుపాకీ, టిఫిన్లు, పెంపుడు కుక్కలు, స్ప్రేలు, విజిల్లు, కెమెరాలు, సిరంజిలు, ప్రమోషనల్ ప్రొడక్ట్స్, ల్యాప్‌టాప్, పెన్నులు, పెన్సిళ్లు, కుర్చీలు, గొడుగులు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ నిషేధ వస్తువులపై నిఘా పెడతామని పోలీసులు సైతం తెలిపారు.