News August 29, 2024
విశాఖలో మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యేలు భేటీ
విశాఖ టీడీపీ కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే పి.శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి తదితరులు లోకేశ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Similar News
News September 12, 2024
విశాఖ: తిరుపతి శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.
News September 12, 2024
పరవాడ ఫార్మాసిటీలో విషాదం
పరవాడ ఫార్మాసిటీలో విషాదం నెలకొంది. ఎడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమంలో అదృశ్యమైన ఆర్.సూర్యనారాయణ మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై కనిపించాడు. మంగళవారం విధులకు హాజరైన ఆయన తిరిగి ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్‌కి అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఘటనపై విచారణ జరిపి మృతుని కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
News September 12, 2024
భీమిలి: ‘అక్రమ నిర్మాణాల సంగతి తేల్చండి’
భీమిలి బీచ్ సమీపంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల సంగతి తేల్చాలని హైకోర్టు జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. భీమిలి బీచ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ కూడా నిర్మించారని దీనిపై జోక్యం చేసుకోవాలని జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది.