News February 26, 2025
విశాఖలో మర్డర్ చేసిన విజయనగరం వ్యక్తి

విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్థానికి చెందిన వై.శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి వెంకోజిపాలెం వద్ద మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. భయపడి ఆనంద్ పారిపోగా.. శ్రీను వెంటపడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 22, 2025
VZM: ‘PMAGY పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి’

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (PMAGY) పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈ పథకం అమలుపై సోమవారం సమీక్ష జరిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 500 జనాభా కలిగి, 40% ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలోని మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలస మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ప్రతిపాదించారు.
News December 22, 2025
విజయనగరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలతో అర్జీలు సమర్పించాలని, పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని తెలిపారు.