News March 31, 2025
విశాఖలో మహిళను నిండా ముంచిన రాంగ్ కాల్

శ్రీకాళహస్తికి చెందిన B.అక్షయ్ విశాఖకు చెందిన మహిళ(35)కు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా మెసేజ్లు చేశాడు. కొంతకాలం తర్వాత మెసేజ్లు ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసి రూ.10లక్షలు దోచేశాడు. ఆమెపై లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి వేధించాడు. చివరకు మహిళ భర్త సాయంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు.
Similar News
News December 20, 2025
గండిపేట: నిఘా నేత్రాలకు పక్షవాతం!

₹కోట్లు కుమ్మరించి నిర్మించిన గండిపేట ల్యాండ్స్కేప్ పార్కులో భద్రత గాలిలో దీపమైంది! అక్కడి నిఘా నేత్రాల పనిచేయక అక్రమార్కుల ధాటికి చెరువు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు నిద్రలేచిన HMDA, కెమెరాల మరమ్మతులు, ఏడాది నిర్వహణ O&Mకు ₹14,62,079తో టెండర్లు పిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, కాలుష్యం ముదిరిన తర్వాత ఇప్పుడు మరమ్మతులకు పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News December 20, 2025
బొల్లారంలో పూలు గుసగుసలాడేనని.. సైగ చేసేనని

అందమైన పూలు.. అలరించే రంగులు.. మనలను కనువిందు చేయనున్నాయి. కొత్త ఏడాదిలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు వేదిక కానుంది. JAN 3 నుంచి 9 రోజుల పాటు (11 వరకు) ఉ. 10 నుంచి రాత్రి 8 వరకు ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. ప్రవేశం ఉచితమని.. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని రాష్ట్రపతి నిలయం ఆఫీసర్ రజినీ ప్రియ తెలిపారు.
News December 20, 2025
నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.


