News February 25, 2025
విశాఖలో మూతపడిన మద్యం షాపులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎక్సైజ్ అధికారులు ప్రతి మద్యం దుకాణం వద్దకు చేరుకొని సీల్డ్ వేసి తాళాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో మళ్లీ 27 సాయంత్రం 4 గంటల తర్వాత మద్యం షాపులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.
Similar News
News February 26, 2025
శ్రీకాకుళం వరకే విశాఖ -పలాస పాసింజర్

విశాఖ-పలాస రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ-పలాస పాసింజర్ (67289/90)శ్రీకాకుళం వరకు మాత్రమే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. మార్చ్ 2 నుంచి మార్చ్ 8వరకు ఈ రైళ్ళు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 26, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గతేడాది విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన, క్షతగాత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం తరపున అందిన సహాయక చర్యలపై ఆరా తీశారు.
News February 26, 2025
విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో మూతపడిన మద్యం షాప్‌లు ➤ విశాఖ ఆర్డీవో శ్రీలేఖకు హైకోర్టులో చుక్కెదురు ➤ నేటితో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ➤ ఎమ్మెల్సీ ఎన్నికలకు 123 పోలింగ్ కేంద్రాలు.. 22493 మంది ఓటర్లు ➤ రేపు విశాఖ రానున్న సినీ నటుడు బ్రహ్మానందం ➤ విశాఖలో ఆధార్ కార్డు లేని చిన్నారులు 3200 మంది ➤ వెంకోజీపాలెంలో వ్యక్తి దారుణ హత్య