News March 28, 2025
విశాఖలో మేయర్ సీటుపై హీట్

విశాఖలో మేయర్ సీటుపై హీట్ రేగుతోంది. మేయర్పై అవిశ్వాస తీర్మాన వ్యవహారంపై వైసీపీ తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తుండగా పూర్తిస్థాయిలో బలం మాకే ఉందని కూటమి నాయకులు చెబుతున్నారు. మొత్తం 112 ఓట్లు ఉండగా 75 ఓట్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా నమోదు కావాలి. కూటమికి 64 మంది కార్పొరేటర్లు. 11 మంది ఎక్స్ అఫీషియ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా వైసీపీ, కూటమి ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 3, 2025
మారికవలసలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మధురవాడలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన బలగ ప్రభాకర్ (50) మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తుండగా.. మారికవలస నేషనల్ హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక సీటులో కూర్చున్న ప్రభాకర్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు.
News April 3, 2025
గాజువాకలో యాక్సిడెంట్

గాజువాకలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన లావేటి క్రాంతి కుమార్, శ్రీహరిపురానికి చెందిన వాసవి సాఫ్ట్వేర్ ఉద్యోగులు. గురువారం ఉదయం డ్యూటీ ముగించుకొని రుషికొండ నుంచి గాజవాక వస్తుండగా షీలా నగర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
News April 3, 2025
విశాఖ: భర్త దాడిలో భార్య మృతి

విశాఖలో వివాహిత రమాదేవి చికిత్స పొందుతూ మృతిచెందింది. మాధవధారకు చెందిన రమాదేవి, బంగార్రాజు మధ్య గొడవలు జరగ్గా రమాదేవి పుట్టింటికి వెళ్లింది. గతనెల 30న బంగార్రాజు అక్కడికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరగా అడ్డగించి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను KGHకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.