News December 13, 2024

విశాఖలో యువకుడి మృతిపై స్పందించిన మంత్రి లోకేశ్

image

విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్‌యాప్ వేధింపులకు బలి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్‌ల కాన్ఫిరెన్స్‌లో మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. యువకుడి ఫొటోతో పాటు అతని భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపి ఆత్మహత్యకు కారణమయ్యారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరగా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించారు. దీనిపై చిట్టా బయటకు తీస్తామని విజిలెన్స్ డీజీ తెలిపారు.

Similar News

News January 13, 2025

విశాఖ: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం

News January 12, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగీ పండుగ నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. విశాఖ నగర ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

News January 12, 2025

వైజాగ్‌లో ఒప్పో రెనో 13 సిరీస్ లాంఛ్

image

ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్‌ను విశాఖ డాబా గార్డెన్స్ సెల్ పాయింట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి డింపుల్ హయాతి మార్కెట్లోకి విడుదల చేశారు. చైర్మన్ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ.. సంక్రాతి సందర్బంగా ప్రత్యేక రాయితీలు, లక్కీ డ్రా అందుబాటులో ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ పాయింట్ డైరెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.