News May 11, 2024
విశాఖలో రికార్డుస్థాయి ఓటింగ్

ఎన్నికల విధుల్లో పాల్గొని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. దీనికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు విశాఖలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో అనూహ్య స్పందన లభించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 6,651 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా 2024లో జరుగుతున్న ఎన్నికలకు ఏకంగా 15,993 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు.
Similar News
News February 12, 2025
విశాఖలో హత్యకు గురైన MRO భార్యకు ఉద్యోగం

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.
News February 12, 2025
భీమిలి: బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 12, 2025
రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు

సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. దేవాలయ కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సున్నం, అరబిక్ చెట్ల జిగురు, బెల్లం, జనపనార మిశ్రమాన్ని వాడి లీకేజీలు నివారిస్తామన్నారు.