News April 2, 2024
విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖలో ఈనెల 3న జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.
Similar News
News February 25, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు

పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు హాజరై ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
News February 25, 2026
VZM: ‘పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

విజయనగరం జిల్లాలో రీసర్వే, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా 100% పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో జరిగిన వీసీ అనంతరం ఆయన మాట్లాడారు. రీసర్వే గ్రామాల్లో సర్వేయర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు.