News March 23, 2025
విశాఖలో రేపే మ్యాచ్..

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Similar News
News March 29, 2025
ఈ నెల 31న రంజాన్ సందర్భగా గ్రీవెన్స్ రద్దు: VZM SP

రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న శెలవుగా ప్రకటించినందున జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రిసల్ సిస్టం’ను రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంకు మార్చి 31న ప్రజలెవరూ రావద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
News March 29, 2025
VZM: గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు

గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు గురుకుల జిల్లా కన్వీనర్ కె.రఘునాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ 6 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 29, 2025
అనుమానస్పద స్థితిలో యువతి మృతి

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.