News March 23, 2025
విశాఖలో రేపే మ్యాచ్..

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Similar News
News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
News November 18, 2025
మేడ్చల్: ‘కాలుష్యానికి కారణ భూతంగా.. ఈ పరిశ్రమలు..!

మల్లాపూర్, నాచారం, చర్లపల్లి, కీసర, ప్రశాంత్ నగర్, బొల్లారం, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో 60కి పైగా అనుమతులు లేని పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమలు తమ రోజువారీ ఉత్పత్తుల సామర్థ్యం మేరకు వ్యర్థ ద్రవాల శుద్ధి సదుపాయాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తేలింది. ఇవే కాలుష్యానికి ప్రధాన కారణభూతంగా మారుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
News November 18, 2025
కర్నూలు ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

కర్నూలు జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. జాతీయ రహదారిపై కేశవ గ్రాండ్ హోటల్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన లక్ష్మీనారాయణ(56), శ్రీనివాసులు(65), రామిరెడ్డి(40)గా పోలీసులు గుర్తించారు. మెకానిక్ షేక్ జిలాని బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


