News November 19, 2024

విశాఖలో రోజాపై ఫిర్యాదు

image

మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు పై విశాఖ టూ టౌన్ స్టేషన్‌లో టీడీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై గతంలో వీరు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమల దేవి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

Similar News

News December 12, 2024

తిరుపతి జిల్లాలోనూ సెలవు

image

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News December 12, 2024

పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: చిత్తూరు JC

image

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఇవాళ సెలవు ప్రకటించించన విషయం తెలిసిందే. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.

News December 12, 2024

చిత్తూరు: ప్రాణం తీసిన యువకుడి వేధింపులు

image

ప్రేమించమని వేధించడంతో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం యాదమరి(M) పాచిగుంటలో జరిగింది. ఎస్ఐ ఈశ్వర్ వివరాల మేరకు.. కీర్తన(17)కు ఇటీవల వివాహమైంది. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సంతోశ్ కుమార్ ప్రేమించాలని వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన కీర్తన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.