News March 10, 2025
విశాఖలో రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్‌ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Similar News
News January 18, 2026
విశాఖ: 17 రోజుల్లో రూ.120 కోట్ల మద్యం తాగేశారు

విశాఖలో ఈనెల మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విశాఖ పరిధిలో 280 మద్యం దుకాణాల ద్వారా 1,52,000 లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 81000 బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు డిపో మేనేజర్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది కంటే ఐదు శాతం ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు.
News January 18, 2026
బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన నేతలు

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని విశాఖలో నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News January 18, 2026
విశాఖ పోర్టుకు మరో రికార్డు

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.


