News March 12, 2025
విశాఖలో విచ్చలవిడిగా గుట్కా..!

విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 16, 2025
విశాఖ జిల్లా పి.టి.ఐ.లు ప్రాంతీయ సదస్సు

సమగ్ర శిక్షాలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పి.టి.ఐ.లను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేసి, బోధనేతర పనుల భారం తగ్గించాలని,ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
News March 16, 2025
విశాఖలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

విశాఖలో ఓ బాలిక తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. MVP పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కవానిపాలెంలో ఉంటున్న రమాదేవి, సురేష్ దంపతుల కుమార్తె సాయి తనూష (16) 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం గమనించిన తల్లి తనూషాను శుక్రవారం మందలించింది. దీంతో బాలిక రాత్రి రూములో తలుపులకు గడి పెట్టుకుంది. తల్లి తలుపులు కొట్టినా తీయలేదు. చివరకు తలుపులు పగలుకొట్టగా బాలిక ఉరివేసుకుని ఉంది.
News March 15, 2025
విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.