News April 2, 2025
విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య

విశాఖలో 21 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని ఓ ఇనిస్టిట్యూట్లో డిప్లమో ఫైనల్ ఇయర్ చదువుతున్న పైలా దివ్య పెదగంట్యడలోని నేతాజీ నగర్లో ఉంటోంది. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మంగళవారం తెలిపారు.
Similar News
News November 28, 2025
అనకాపల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

యుపీఎస్సీ సివిల్స్కు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకు సిద్ధం అయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే.శ్రీదేవి తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలతో పాటు 2 ఫొటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్ జత చేయాలన్నారు.
News November 28, 2025
ఖమ్మం: వరి కొయ్యలను కాల్చొద్దు.. కలియ దున్నాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు వరి కొయ్యలను తగులబెట్టడం మానుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి, పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు తెలిపారు. దానికి బదులుగా, వ్యర్థాలను పొలంలోనే కలియదున్నడం వంటి పద్ధతులను అనుసరించాలని కోరారు. దీని వల్ల మట్టిలో పోషకాలు పెరిగి, భూసారం మెరుగుపడుతుందని అధికారులు రైతులకు వివరించారు.
News November 28, 2025
RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.


