News June 5, 2024

విశాఖలో వైఎస్ఆర్ పేరుపై స్టిక్కర్..!

image

విశాఖ సీతకొండ దగ్గర YSR వ్యూ పాయింట్ పేరును అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా గుర్తు తెలియని వ్యక్తులు మార్చారు. జీ-20 సమయంలో విశాఖ నగరాన్ని సుందరీకరించి సీతకొండ దగ్గర వ్యూ పాయింట్‌ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా నామకరణ చేసి ఇక్కడ నేమ్ బోర్డు సైతం పెట్టారు. తాజాగా వైఎస్సార్ అక్షరాలపై అబ్దుల్ కలాం స్టిక్కర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతికించినట్లు తెలుస్తోంది.

Similar News

News November 7, 2024

విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

image

విశాఖలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. చినగదిలిలో రెండు ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలంపిక్స్ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని అన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

News November 7, 2024

వందేభారత్ Vs జన్ సాధారణ్.. మీ ఓటు దేనికి?

image

విజయవాడ-విశాఖ మధ్య ప్రారంభించిన ‘జన్ సాధారణ్'(అన్నీ జనరల్) రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుండగా.. విశాఖ మీదుగా వెళ్తున్న వందేభారత్‌‌కు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. విశాఖ, నర్సీపట్నం, దువ్వాడ, అనకాపల్లి నుంచి సామాన్యులు, చిరుద్యోగులు రాకపోకలు సాగిస్తారు. సరిపడా రైళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వందేభారత్‌కు బదులు జన్ సాధారణ్ రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు దేనికి ఓటేస్తారు?

News November 7, 2024

విశాఖ: ఈ నెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌సీ‌హెచ్.వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలలో మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు ముగింపు రోజున బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే గ్రంథాలయాల్లో కవి సమ్మేళనాలు జరుగుతాయన్నారు.