News October 21, 2024

విశాఖలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో శివాజీ పాలెంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులకు ముందుగా సమాచారం అందింది. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఎంవిపి పోలీస్ స్టేషన్‌కు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.

Similar News

News January 24, 2025

గంభీరం డ్యామ్‌లో బీటెక్ విద్యార్థి మృతి

image

ఆనందపురం మండలం గంభీరం డ్యామ్‌‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మీసాల నాని(20) మృతి చెందాడు. సివిల్ ఇంజినీర్ థర్డ్ ఇయర్‌ చదువుతున్న నాని కోమ్మదిలో ఓ ప్రవేటు హాస్టల్లో ఉంటున్నాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటకు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 24, 2025

పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ స‌హ‌కారం: విశాఖ కలెక్టర్

image

జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా సంపూర్ణ స‌హ‌కారం అందించాల‌ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి కమిటీ సమావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌చ్చే వారికి అన్ని విధాలా స‌హ‌కారం అందించాల‌ని సూచించారు. భూ సేక‌ర‌ణ‌, సింగిల్ విండో క్లియ‌రెన్స్ అంశాల్లో వేగం పెంచాల‌ని ఆదేశించారు.

News January 24, 2025

ఆదివారం మాంసం దుకాణాలు బంద్‌: జీవీఎంసీ

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు మేరకు విశాఖలో మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ దువ్వాడ, మంగళపాలెం, నరవ ప్రాంతాల్లో దుకాణ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.