News November 21, 2024
విశాఖలో సయ్యద్ ముక్తర్ అలీ టోర్నీ
విశాఖతో పాటు విజయనగరం విజ్జీ స్టేడియంలో ఈనెల 23 నుంచి సయ్యద్ ముక్తర్ అలీ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అస్సాం, ఒడిశా, పాండిచ్చేరి, చత్తీస్‌గఢ్, విదర్భ, రైల్వేస్ జట్లు పోటీ పడనున్నాయని అన్నారు. ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లలో పాల్గొంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
Similar News
News December 9, 2024
విశాఖ డైరీకి పూర్వ వైభవం తెస్తాం: స్పెషల్ హౌస్ కమిటీ
విశాఖ డైరీ అక్రమాలపై ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస్ కమిటీ సోమవారం కలెక్టరేట్‌లో రివ్యూ జరిపింది. మేనేజంగ్ డైరెక్టర్ గారు కంపెనీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, త్రిప్ట్ సొసైటీ ద్వారా నిధుల మల్లింపు ఆరోపణలపైన కూడా వివరం కోరామని అన్నారు. రైతులకు న్యాయం చేసి రాజకీయాలకు అతీతంగా డెయిరీని అభివృద్ధి చేయడమే ఈ హౌసింగ్ కమిటీ లక్ష్యమని అన్నారు. అధికారులు సహకరిస్తే సాధ్యమని తెలిపారు.
News December 9, 2024
అల్లూరి జిల్లాలో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లిలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందారని ఎస్‌ఐ కే.రమణ తెలిపారు. గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మి(36), ఆమె కుమారుడు సంతోష్(13), కుమార్తె అంజలి(10) ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 9, 2024
విశాఖ-సికింద్రాబాద్ మధ్య సంక్రాంతికి స్పెషల్ ట్రైన్
సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(07097/07098) ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈనెల 15, 22,29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్(07097/07098) స్పెషల్ విశాఖ నుంచి 16, 23,30 తేదీల్లో నడుస్తాయన్నారు. >Share it