News April 29, 2024
విశాఖలో సీఎం జగన్ పర్యటన … షెడ్యూల్ ఇదే..!

సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.
Similar News
News October 27, 2025
విశాఖ: మొంథా తుఫాన్.. జాగ్రత్తగా ఉండండి

తుఫాన్ నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 0891- 2590102, 0891- 2590100 ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు నిషేధించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు.
News October 27, 2025
విశాఖలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ సీఐ ఉమా మహేశ్వరరావు రౌడీ షీటర్లకు సత్ప్రవర్తనతో మెలగాలని, నిత్యం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో తలదూర్చకుండా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.
News October 26, 2025
విశాఖ: ఆర్టీసీ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పరిశీలించిన రీజనల్ మేనేజర్

ఆర్టీసీ విశాఖ జిల్లా రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం ఆర్టీసీ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పరిశీలించారు. విశాఖ నుంచి బయలుదేరే ఏసీ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లకు బస్సుల్లో ఏటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన కల్పించారు. ఎమర్జెన్సీ డోర్స్ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.


