News March 2, 2025

విశాఖలో స్పా సెంటర్‌పై దాడి.. ఏడుగురి అరెస్ట్

image

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్‌పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్‌లో దాడులతో మిగతా స్పా సెంటర్‌లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 7, 2026

HYD: టెక్నికల్ స్కిల్స్‌తోనే భవిష్యత్

image

టెక్నాలజీతో ప్రపంచం పరుగులు తీస్తుందని HYD టెక్నిపుణులు సురేంద్ర సింగ్ తెలిపారు. హైటెక్ సిటీ, T-HUB, KPHBలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ స్ట్రాట అంశాలపై జరిగిన ప్రత్యేక కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత యువత టెక్నికల్ స్కిల్స్, సాప్ట్‌వేర్ స్కిల్స్ పెంచుకోవడంతో పాటు నిత్యం అభ్యాసన చేయాలని సూచించారు.

News January 7, 2026

NLG: సన్న బియ్యం.. క్వాలిటీ పట్టించుకోవట్లే!

image

ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్నబియ్యం నాణ్యత క్రమక్రమంగా తగ్గుతుంది. గత మూడు నాలుగు నెలల నుంచి సన్నబియ్యంలో అధికంగా నూకలు, తౌడు, మెరిగెలు, రాళ్లు వస్తుండడంతో పాటు ముక్క వాసన వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11,54,178 రేషన్ కార్డులు ఉండగా.. 22,132 టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంది. వీటిని తినడానికి 40 శాతం పైగానే మంది ఆసక్తి కనబరచడం లేదు.

News January 7, 2026

నల్గొండ: బైకర్లూ.. హెల్మెట్ల బూజు దులపండి!

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.