News October 9, 2024
విశాఖలో హీరో సుధీర్ బాబు సందడి

విశాఖలో ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్ర బృందం బుధవారం సందడి చేసింది. ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర హీరో సుధీర్ బాబు మాట్లాడారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారన్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, షియాజీషిండే కీలక పాత్రలు పోషించారన్నారు. ఇది తండ్రి, కొడుకుల చుట్టూ తిరిగే కథ అని అన్నారు. ఈ నెల 11న విడుదల అవుతుందని చెప్పారు.
Similar News
News December 10, 2025
విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.
News December 10, 2025
14న విశాఖ తీరంలో నేవీ మారథాన్

విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.