News August 29, 2024
విశాఖలో హుందాతనం… ఒంగోలులో ఎక్కడ: తాటిపర్తి
విశాఖలో చూపించామని చెప్తున్న హుందాతనం.. ఒంగోలు, ఏలూరులో ఎక్కడికిపోయిందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ‘ఓడిపోయే విశాఖ ఎమ్మెల్సీ సీట్‌లో రాజకీయ హుందాతనం పేరుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎగ్గొట్టడం. ఒంగోలు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లను కొనడంలో మాత్రం హుందాతనం బదులు బొంకుతనం ప్రవేశపెట్టడం టీడీపీ రాజకీయ విధానం.’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News September 15, 2024
ప్రకాశం: 50కేజీల లడ్డు సొంతం చేసుకున్న షేక్ కమల్
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉన్న 50 కేజీల లడ్డును కమిటీ నెంబర్లు వేలం వెయ్యగా.. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు షేక్ కమల్ వలి రూ.26 వేలకు లడ్డును దక్కించుకున్నాడు. లడ్డును దక్కించుకున్న ముస్లిం యువకుడిని హిందువులు అభినందించారు. ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు అన్నారు.
News September 15, 2024
చీరాలలో దారుణం.. వివాహితపై లైంగిక దాడి
చీరాల మండలంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీరాల పరిధిలో ఓ మహిళ నివసిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటివద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించి వివాహితను బంధించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాధితురాలు శనివారం ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.
News September 15, 2024
ప్రకాశం: APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ANM/GNM/ BSC-నర్సింగ్ చదివిన వారికి, జపాన్ హాస్పిటల్స్‌లో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా అధికారి రవితేజ శనివారం తెలియజేశారు. జపాన్‌లో పనిచేయడానికి ఆసక్తి కలిగి (32)లోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. జపనీస్ బాషలో 6 నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఒంగోలు కొత్తపట్నం రోడ్‌లోని స్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.