News March 11, 2025

విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వినతి

image

విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ సోమవారం విజయవాడలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలో హైకోర్టు బెంచ్, క్యాట్, జిల్లా కోర్టు ఆవరణలో గత 10నెలలుగా మూతపడ్డ క్యాంటీన్ తెరవాలని కోరారు. కొత్త కోర్టు బిల్డింగుల్లో ఎయిర్ కండిషన్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News December 21, 2025

‘అన్ని పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలి’

image

విశాఖలో అన్ని పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం విద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా అమలు చేయాలని సూచించారు. మంచి అలవాట్లు వలన విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతిరోజు పాఠశాల ప్రార్థనా సమయం కంటే ఒక 5 నిముషాలు ముందు అమలు చేయాలని ఆదేశించారు.

News December 20, 2025

విశాఖలో టెట్ పరీక్షకు 131 మంది గైర్హాజరు: డీఈవో

image

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 2,018 మంది అభ్యర్థులకు గానూ 1,887 మంది అభ్యర్థులు హాజరుకాగా 131 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ రెండు పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్ ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో పేర్కొన్నారు.

News December 20, 2025

విశాఖ: ‘కాంగ్రెస్ అవినీతి విషవృక్షం’

image

కాంగ్రెస్ అవినీతి విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీ ప్రజలకు హ్యాట్సాఫ్ అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. బీచ్ రోడ్‌లో మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణలో పాల్గొని మాట్లాడారు. వైజాగ్ వస్తే బీపీ, షుగర్ ఎగిరిపోతాయన్నారు. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు అని, బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, MP, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు.