News October 18, 2024
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా: లోకేశ్
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ బార్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. వారికి ఆరోగ్య భద్రతతో పాటు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామన్నారు. టీడీపీకి చెందిన నాయకులందరం చట్టాన్ని గౌరవిస్తామన్నారు.
Similar News
News November 8, 2024
అనకాపల్లి: ఈనెల 11 నుంచి అందుబాటులో స్టేజ్-2 దరఖాస్తు
ట్రైనీ కానిస్టేబుల్ పోలీస్ నియామక ప్రక్రియలో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్, ఎఫిషియెన్సీ పరీక్షలు 2024 డిసెంబర్ చివరివారంలో జరుగుతాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దీనికి సంబంధించి స్టేజ్-2 దరఖాస్తు ఫారమ్స్ నింపనివారి కోసం SLPRB వెబ్‌సైట్‌లో ఈనెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News November 8, 2024
అనకాపల్లి: ‘లిక్కర్ పాలసీని సక్రమంగా అమలు చేయాలి’
ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీని అనకాపల్లి జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడికి, గుడికి దగ్గర్లో షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షాపులను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు.
News November 7, 2024
విశాఖ: నైపుణ్య శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖలోని RTC కాంప్లెక్స్ వద్ద ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో IIATP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ వెల్డర్, పైప్ ఫిట్టర్, ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్, ITI విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. 60 నుంచి 80 రోజులు శిక్షణలో భాగంగా ఉచిత వసతి, భోజనం సదుపాయాలను కల్పిస్తారు. ఈ నెల 15వ తేదీలోగా అప్లై చేసుకోవాలని కోరారు.