News March 5, 2025

విశాఖలో హైకోర్టు బెంచ్ కోసం అఖిలపక్ష సమావేశం

image

విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక తేదీ ప్రకటిస్తామన్నా. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలూ మద్దతు ఇవ్వాలని కోరారు.

Similar News

News March 27, 2025

విశాఖలో ముఠా.. నకిలీ వెండి అమ్ముతూ అరెస్ట్

image

విశాఖలో బిహార్‌కు చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. నగరంలోని ఓ జువెలరీ షాపులో 3 కేజీల వెండిని అమ్మేందుకు వెళ్లారు. అనుమానంతో షాపు సిబ్బంది పరీక్షించగా అది నకిలీదిగా తేలడంతో ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదే షాపులోని 2023లో నిందితులు ఏడు గ్రాముల గోల్డ్ కొట్టేసినట్లు గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడి అనంతరం సొంతూళ్లకు వెళ్లిపోతారు.

News March 27, 2025

విశాఖలో కేజీ మామిడికాయల రేటు ఎంతంటే?

image

విశాఖలోని 13 రైతుబజార్లలో గురువారం నాటి కూరగాయ ధరలను అధికారులు విడుదల చేశారు.(రూ/కేజీలలో) టమటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళా దుంపలు రూ.16, వంగ రూ.26/32, బెండ రూ.30, బీర రూ.42, మిర్చి రూ.26, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.24, బరబాట రూ.22, పొటాల్స్ రూ.54, కీర రూ.22, గ్రీన్ పీస్ రూ.54, మామిడికాయలు రూ.42, బద్ధ చిక్కుడు రూ.56, చీమదుంప రూ.30, కాకర రూ.32, బీట్ రూట్ రూ.24, క్యాప్సికమ్ రూ.38గా నిర్ణయించారు.

News March 27, 2025

విశాఖలో డ్రగ్స్ కలకలం

image

విశాఖ త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ డార్మెటరీలో 6.5 గ్రాముల ఎం.డి.ఎం.ఏతో కర్ణాటకకి చెందిన రంగస్వామి నంజి గౌడ (23)గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే నంజి గౌడ చాలాసార్లు సిటీకి వచ్చినట్లు సమాచారం. అతను ఎవరికి డ్రగ్స్ అమ్ముతున్నాడో తెలియాల్సి ఉంది.

error: Content is protected !!