News September 27, 2024

విశాఖలో హై లెవెల్ కమిటీ సమావేశం

image

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలోని నోవాటెల్‌లో అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఆ కమిటీ ఛైర్‌పర్సన్ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కార్మిక శాఖ కార్యదర్శి ఏం.ఏం.నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలోని పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలపై వీరు సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు.

Similar News

News October 17, 2025

విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

image

విశాఖ‌ DRO భవానీ శంకర్‌, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్‌కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది క‌లెక్ట‌ర్‌ను శుక్ర‌వారం క‌లిసి విన‌తిప‌త్రం అందించిన‌ట్లు స‌మాచారం. పచారీ సరుకుల కోసం త‌హశీల్దార్ల‌కు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

News October 17, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం (D)కి చెందిన వినయ్ పురుషోత్తపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వినయ్ తన మిత్రుడు ఉదయ్‌తో తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్‌ చికిత్స్ పొందుతున్నాడు.

News October 17, 2025

విశాఖలో యాక్సిడెంట్.. నవవధువు మృతి

image

విశాఖలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వైపుగా స్కూటీపై వెళ్తోన్న దంపతులను కూర్మన్నపాలెం జంక్షన్లో RTC బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పైడిరాజు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెదగంట్యాడ (M) సీతానగరానికి చెందిన ఉమాదేవి, పైడిరాజుకి 4 నెలల క్రితమే పెళ్లి అయింది.