News September 27, 2024
విశాఖలో హై లెవెల్ కమిటీ సమావేశం
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలోని నోవాటెల్‌లో అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఆ కమిటీ ఛైర్‌పర్సన్ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కార్మిక శాఖ కార్యదర్శి ఏం.ఏం.నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలోని పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలపై వీరు సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు.
Similar News
News October 10, 2024
విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు
విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.
News October 10, 2024
విశాఖ: రూ.40 వేల జీతం.. దరఖాస్తులు ఆహ్వానం
కేజీహెచ్-ఏఎంసీలో నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్లో కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిబాబు తెలిపారు. నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తారని అన్నారు. నెల్స్ సిల్క్ ల్యాబ్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 18లోగా పరిపాలన కార్యాలయం ఆంధ్ర మెడికల్ కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News October 10, 2024
రైల్వే జోన్‌కు త్వరలో భూమి పూజ: ఎంపీ శ్రీభరత్
విశాఖ రైల్వే జోన్ త్వరలో ఏర్పాటు కానున్నట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విశాఖ టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ త్వరలో విశాఖలో రైల్వే జోన్ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటుకు రూ.1700 కోట్లు విడుదలైనట్లు తెలిపారు.