News March 7, 2025

విశాఖలో 12 మందితో సైబర్ టీం 

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సైబర్ నేరాలు నివారించేందుకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ కొత్తగా టీం ఏర్పాటు చేశారు. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని ఎంపిక చేసి బి-కేటగిరిలో హోంగార్డు నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. వీరందరి సహకారంతో సైబర్ నేరాలపై అవగాహన, నియంత్రణ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డీసీపీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 11, 2026

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.

News March 11, 2026

విశాఖలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం..

image

విశాఖలోని భవన నిర్మాణ అనుమతులు, BPS, లేఅవుట్ల క్రమబద్ధీకరణలో అవినీతి ఆరోపణలపై ACB దర్యాప్తు ముమ్మరం చేసింది. మధురవాడ, పెందుర్తి, గాజువాక జోన్ల పరిధిలో ఫిర్యాదులు అందడంతో మంగళవారం సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. గడువు తర్వాత నిర్మించిన భవనాలు, నిర్మాణంలో ఉన్న వాటికి క్రమబద్ధీకరణ దరఖాస్తులు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.

News March 11, 2026

పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

image

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.