News March 9, 2025
విశాఖలో 142 కేసులు పరిష్కారం

విశాఖ జిల్లా కోర్ట్‌లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా 142 కేసులు పరిష్కారం చేసి బాధితులకు రూ.11.76 కోట్ల నష్ట పరిహారం చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలపాటి గిరిధర్ పేర్కొన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి వెంకటరమణ ఉన్నారు.
Similar News
News March 23, 2025
క్షయ వ్యాధి నివారణకు కలిసికట్టుగా పనిచేయాలి: జిల్లా

ఈ నెల 24 న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని వైద్య సూపరింటెండెంట్‌లతో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ సమావేశమయ్యారు. క్షయ వ్యాధిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి సోకిన వ్యక్తులను వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపరాదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి కలెక్టర్ ఆఫీస్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు.
News March 22, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

సామర్లకోట, పిఠాపురం మధ్య రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ -కాకినాడ పాసెంజర్ (17267/68), విశాఖ – రాజమండ్రి పాసెంజర్ (67285/86), విశాఖ -గుంటూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ (22875/76) రైళ్ళు మార్చి 24న రద్దు చేశామన్నారు. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239/40) రైళ్ళు మార్చి 24, 25న రద్దు చేశామన్నారు.
News March 22, 2025
విశాఖ: పేదరిక నిర్మూలనకు పి-4 దోహదం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి-4 విధానం పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని, అధికారులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు సంఘాల ప్రతినిధులు, అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. పి-4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని, అందరూ దీని ఆవశ్యకతను తెలుసుకొని భాగస్వామ్యం కావాలన్నారు.