News December 2, 2024

విశాఖలో 9 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు..!

image

ఏపీలో జిల్లాల వారీగా మొత్తం 34 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ మండలం ఈ.బోనంగి, విశాఖ గ్రామీణ ప్రాంతం మధురవాడ, రేసపువానిపాలెం, నక్కపల్లి మండలం, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు, జి.కోడూరు ప్రాంతాలు ఉన్నాయి.

Similar News

News January 21, 2025

స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే: మంత్రి కొల్లు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం భూదోపిడి కోసమే స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని నడిపారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌కు ప్రధానితో శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు.

News January 21, 2025

ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృతి?

image

ఛ‌త్తీస్‌ఘ‌డ్-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మంగళవారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు చ‌ల‌ప‌తి, ఒడిశా మావోయిస్టు పార్టీ ఇన్‌‌ఛార్జ్ మొండెం బాల‌కృష్ణ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారికంగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతుండగా,మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముందని పోలీసు వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి.

News January 21, 2025

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

image

పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.