News September 27, 2024
విశాఖలో NTR ఫ్యాన్స్ నిరసన

విశాఖ సంగం-శరత్ థియేటర్ వద్ద NTR నటించిన ‘దేవర’చిత్రం విడుదల సందర్భంగా డీజే ఏర్పాటుపై పోలీసులకు ఫ్యాన్స్‌కు మధ్య గురువారం రాత్రి వాగ్వివాదం జరిగింది. థియేటర్ వద్ద డీజే ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఫ్యాన్స్ నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఫ్యాన్స్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం డీజే ఏర్పాటుకు పోలీసు అధికారులు అనుమతి ఇచ్చారు.
Similar News
News October 23, 2025
తాడేపల్లి కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర: టీడీపీ

గాజువాకలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర జరిగిందని, జోగి రమేష్ – జనార్ధన్‌రావుల ప్రమేయంతోనే కల్తీ తయారైందని పల్లా ఆరోపించారు. ఏపీ సురక్షా యాప్‌ను లాంచ్ చేసి, కల్తీని అరికట్టేందుకు QR కోడ్ విధానం, 13 రకాల టెస్టులు ప్రవేశపెట్టామని చెప్పారు.
News October 23, 2025
విశాఖలో నకిలీ కరెన్సీ గుట్టు రట్టు

విశాఖ ఎంవీపీ కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరాం గుప్తా, వరప్రసాద్ కలిసి ఒక రూమ్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు దాడి చేశారు. ప్రింటర్స్, ఫోన్లు, కరెన్సీ తయారీ సామాగ్రి, లాప్టాప్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద బస్సు, లారీ ఢీ

విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి విశాఖపట్నం వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు.