News July 17, 2024
విశాఖ: అండర్-19 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం

విశాఖ నగరంలో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ అండర్-19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మొదటి రోజు విశాఖ – రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. అనంతరం నార్త్ జోన్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. విశాఖ జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Similar News
News October 24, 2025
‘కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News October 23, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News October 23, 2025
మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: జేసీ

బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసి మయూర్ అశోక్ తెలిపారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో మధ్యాహ్న బడి భోజనం పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. క్వాలిటీ, క్వాంటిటీల్లో రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నరా అని తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.


