News May 25, 2024
విశాఖ: అంపైర్లు, స్కోరర్ల వేతనాలు పెంపు
అంపైర్లు, స్కోరర్లు, మ్యాచ్ అఫీషియల్స్‌కు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. పెంచిన వేతనాలు నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. జిల్లా, జోనల్ స్థాయి అంపైర్లకు రోజుకు రూ.1500 నుంచి రూ.2500, స్కోరర్లకు రూ.800 నుంచి రూ.1500 వేతనం పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా డైలీ అలవెన్సు కూడా పెంచామన్నారు.
Similar News
News November 17, 2024
విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన 10,006 మంది
విశాఖలో ఇందిరా గాంధీ జూపార్క్ సందర్శకులతో ఆదివారం కిటకిటలాడింది. కార్తీక మాసం కావడంతో వనయాత్రలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. ఆదివారం ఒక్కరోజే 10,006 మంది పర్యాటకులు పార్క్‌ను సందర్శించారు. ఈ ఒక్కరోజు రూ.7,75,530 ఆదాయం వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు.
News November 17, 2024
పరవాడ ఎస్ఐ సస్పెండ్
పరవాడ ఎస్ఐ ఎం. రామారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీఐజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం నాతవరం నుంచి రామారావు బదిలీపై పరవాడ వచ్చారు. నాతవరం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఓ సివిల్ తగాదాలలో తలదూర్చిన కారణంగా రామారావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సివిల్ తగాదాకు సంబంధించి ఓ మహిళ డీఐజీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ నిర్వహించి సస్పెండ్ చేశారు.
News November 17, 2024
దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్: అరకు ఎంపీ
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మోసం చేశారంటూ వైఎస్.జగన్ అన్నారు. ఈ వీడియోను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి తన ‘x’ అంకౌంట్లో అప్లోడ్ చేశారు. ఈ పోస్టపై ‘@ncbn నీకు దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్. చేతకాకుంటే పదవి నుంచి తప్పుకో. అంతేకానీ ప్రశ్నించే వాళ్లను జైలులో పెట్టి హీరోనని ఫీల్ అయిపోతే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు.