News November 19, 2024

విశాఖ అత్యాచార ఘటనపై హోంమంత్రి స్పందన

image

విశాఖ లా స్టూడెంట్ <<14651987>>అత్యాచార ఘటనపై<<>> హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోంమంత్రి అన్నారు.

Similar News

News November 22, 2024

విశాఖ: జీవీఎంసీ క్రికెట్ జట్టు ఘన విజయం

image

విశాఖలో జింక్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో జీవీఎంసీ జట్టు ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. గురువారం జరిగిన వీడీసీఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో GVMC క్రికెట్ జట్టు 47 పరుగుల తేడాతో MOV జట్టుపై ఘన విజయం సాధించిందన్నారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన జీవీఎంసీ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం MOV జట్టు 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందిందన్నారు.

News November 22, 2024

అనకాపల్లి: ‘ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి’

image

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ డిసెంబర్ చివరినాటికి లక్ష గృహాలను పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశించారు. విజయవాడ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News November 21, 2024

విశాఖలో ట్రాఫిక్ ఎస్‌ఐ, రైటర్‌ సస్పెండ్

image

విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎన్‌వి భాస్కరరావును, రైటర్ సీహెచ్.జయరావును గురువారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి నగదు తీసుకొని కేసును డిస్పోజ్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ దర్యాప్తు చేసి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు.