News July 14, 2024

విశాఖ అధికారులకు మంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశాలు

image

విశాఖ <<13613533>>ముడసర్లోవ<<>> పార్కు పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే చర్యలు చేపట్టవద్దని జీవీఎంసీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఏ.ఎస్ శర్మ లేఖపై స్పందించిన ఆయన.. జీవీఎంసీ అధికారులను వివరణ కోరారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.

Similar News

News December 30, 2025

REWIND: సైబర్ క్రైమ్‌లో 205 మంది అరెస్ట్.. విశాఖ సీపీ

image

విశాఖలో 2025లో సైబర్ క్రైమ్ సంబంధించి 205 మందిని అరెస్టు చేశామని సీపీ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. వీరి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని వివరించారు. వార్షిక సమావేశం ముగింపులో ఆయన మాట్లాడారు. విశాఖలో నేర, శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. సమావేశంలో డీసీపీ మణికంఠ, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

News December 30, 2025

న్యూ ఇయర్ వేళ విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..

image

విశాఖలో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, ఆర్కే బీచ్ రోడ్డు, BRTS రోడ్లపై వాహనాలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి నడిపినా వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బీచ్ సందర్శకులకు ఏయూ గ్రౌండ్స్, APIIC గ్రౌండ్, గోకుల్ పార్కుల్లో పార్కింగ్ కేటాయించామని ADCP ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News December 30, 2025

వైకుంఠ ఏకాదశి రద్దీ: సింహాచలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు కొండపైకి ద్విచక్ర వాహనాలను నిలిపివేసి, కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.