News January 31, 2025
విశాఖ: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీరప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్‌గా గుర్తించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న వికారాబాద్

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు వికారాబాద్ ముస్తాబైంది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్‌లో హిందూ ఏక్తా ర్యాలీలు నిర్వహించనున్నారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను పట్టణాల్లో ఊరేగిస్తారు. గతంలో పూడూరు మండలంలో ఛత్రపతి విగ్రహాన్ని MLA రాజాసింగ్ ఆవిష్కరించారు. ఇక్కడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు వికారాబాద్ హోరెత్తనుంది.
News February 19, 2025
నిర్మల్: 5 మండలాల ప్రజలకు శుభవార్త

అభయారణ్యంలోని అటవీ చెక్ పోస్టుల ద్వారా 5 మండలాల ప్రజల వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు జన్నారం మండలంలోని ఇందన్పల్లి FRO శ్రీనివాస్ తెలిపారు. జన్నారం, కడెం, దస్తురాబాద్, దండేపల్లి, ఉట్నూర్ మండలాల వాహనాలకు చెక్ పోస్టుల ద్వారా అనుమతి ఉందన్నారు. ఆ వాహనాల యజమానులు సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ధ్రువీకరణ పత్రాలు చూపించి సహకరించాలన్నారు.
News February 19, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతలు వీరే

* 1998- దక్షిణాఫ్రికా
* 2000- న్యూజిలాండ్
* 2002- భారత్ & శ్రీలంక(సంయుక్తం)
* 2004- వెస్టిండీస్
* 2006- ఆస్ట్రేలియా
* 2009- ఆస్ట్రేలియా
* 2013- భారత్
* 2017- పాకిస్థాన్